అభివృద్ధి జరగాలంటే కొన్ని కోల్పోక తప్పదు.. కూల్చివేతలపై CM రేవంత్ పరోక్ష స్పందన

by Gantepaka Srikanth |

హైదరాబాద్ కొత్వాల్‌గూడలో బుద్వేల్ లేఅవుట్ ఇంటర్‌ఛేంజ్ శంకుస్థాపన, ఎకో హిల్ పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి జరగాలంటే కొన్ని కోల్పోక తప్పదు.. కూల్చివేతలపై CM రేవంత్ పరోక్ష స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కొత్వాల్‌గూడలో బుద్వేల్ లేఅవుట్ ఇంటర్‌ఛేంజ్ శంకుస్థాపన, ఎకో హిల్ పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మూసీ నదిలో, పరివాహక ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది. అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ అనుకోరు. అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడాం.. అందరినీ ఆదుకుంటాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

దేశంలో మన హైదరాబాద్ కంటే సుందరమైన నగరం మరొకటి లేదు. ఈ ఎకోపార్క్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మంచి ప్రభుత్వాలు ఉంటే నగరాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయొచ్చు. తాము అభివృద్ధి చేస్తుంటే, రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే గత పాలకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత పదేళ్లలో వారేం చేయలేదు కాబట్టి.. ఇప్పుడు మమ్మల్ని కూడా చేయనీయడం లేదు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మన నగరం ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story