- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతోన్న సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. కాసేపట్లో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!
by Kema Shiva Kumar |
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్, అమిత్ షాలతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) రెండో దశ విస్తరణ పనులు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, రాష్టానికి కావాల్సిన తక్షణ ఎరువుల కోటా విడుదల అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాంకేతిక, ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరనున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






