- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగ నోటిఫికేషన్‌పై CM రేవంత్ కీలక ప్రకటన
ఉద్యోగ నోటిఫికేషన్‌పై CM రేవంత్ కీలక ప్రకటన

దిశ, ఆదిలాబాద్: అక్రమ సొమ్ముతో కల్వకుంట్ల కుటుంబంలో పైసల పంచాయితీ కొనసాగుతోందని.. ప్రజల సొమ్ము తిన్నవాడేవడు బాగుపడలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌ను అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌కు ఏడాదిలోలే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామన్నారు. త్వరలో ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిలాబాద్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, చనక కోరట ప్రాజెక్టును రానున్న కొద్దీ రోజుల్లోనే ప్రారంభిస్తామన్నారు.
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి న్యాయం జరగలేదన్నారు. అదేవిధంగా తెలంగాణలో త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు. పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని.. ఎన్నికల్లో అడ్డంగా ఖర్చుపెట్టి ఇబ్బందుల పాలు కావద్దన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తాను రెండేళ్లలో ఎప్పుడు కూడా సెలవు తీసుకోలేదని.. ఒక గంట కూడా సెలవు తీసుకోకుండా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానన్నారు. చిన్న వయసులోనే అన్ని పదవులు కందిపుచ్చుకొని ఈ స్థాయికి రావడం తెలంగాణ ప్రజలు ఆశీర్వాదమే అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు వెళుతున్నామని పేర్కొన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని సచివాలయానికి కూడా రానివ్వలేదన్నారు.






