కొత్త సర్పంచ్‌లకు బిగ్ టాస్క్.. నర్సంపేట వేదికగా CM రేవంత్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

కొత్త సర్పంచ్‌లకు బిగ్ టాస్క్.. నర్సంపేట వేదికగా CM రేవంత్ కీలక ప్రకటన

కొత్త సర్పంచ్‌లకు బిగ్ టాస్క్.. నర్సంపేట వేదికగా CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా ఆస్తులు సంపాదించారు.. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని చేయలేదు. గాలికి వదిలేశారని అన్నారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. వరికి ప్రోత్సాహకాలిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మా పార్టీదని అన్నారు. ఫాంహౌస్‌లు కట్టుకున్నారు.. విమానాలు కొన్నారు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. ఉద్యమగడ్డ అయిన వరంగల్‌కు మాత్రం ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. పదేళ్లలో ఏనాడూ రైతు రుణమాఫీ చేయలేదు.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు.

3 కోట్ల 10 లక్షల మందికి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తోందని అన్నారు. ప్రొఫెసర్ జయంశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని అన్నారు. ఆర్థిక భారం అనుకోలేదని.. పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో పనులు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఆగిపోయింది.. కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళలకు చీర అందేలా స్వయంగా తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. గ్రామాల్లో చీరలు మహిళలకు చేర్చే బాధ్యత సర్పంచ్‌లే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Next Story