ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో CM రేవంత్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో CM రేవంత్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల(MLAs) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు కోరాలని నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఏజీ సలహా తీసుకున్నారు. రెండు, మూడురోజుల్లో మళ్లీ భేటీ కావాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు వారి సమస్యలు చెప్పారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేదాలపై ఫిర్యాదు చేశారు. అభివృద్ధికి సహకరించడం లేదని ఆవేదన చెందారు. పలువురు నేతలు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. చర్చలతో వర్గవిభేదాలు పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు. సంక్షేమం, అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పారు. అయితే.. నిన్నటి సమావేశంలో కడియం శ్రీహరి మినహా మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Next Story