- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు కుటుంబం నుంచి వచ్చా.. వారి తలరాత మార్చడమే నా లక్ష్యం: CM రేవంత్
రైతు కుటుంబం నుంచి వచ్చా.. వారి తలరాత మార్చడమే నా లక్ష్యం: CM రేవంత్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్(Telangana Rising Vision Document)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నేత చాలా చైతన్యవంతమైన నేల. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. చివరకు స్వరాష్ట్రం సాధించుకున్నా కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదు. అందుకే ఒక సమగ్ర ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక విజన్‌తో డాక్యుమెంట్‌ను రూపకల్పన చేశాం. తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారు. దాంతో పాటే తాము కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకనామీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అన్ని వర్గాలను వారిని సంప్రదించి విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కేలా డాక్యుమెంట్ రూపకల్పన చేశాం. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని తొలి ప్రధాని నెహ్రూ భావించేవారు. అందుకే ఆయన ఎక్కుగా యూనివర్సిటీలు, ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించారు. నెహ్రూ చూపిన మార్గం చిరకాలం అనుచిరస్మరణీయం.
తాను ఒక మారుమూల గ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చాను. గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన నాకు పేదలు, రైతుల సమస్యలు బాగా తెలుసు. నా ఆలోచనలు, డాక్యుమెంట్ కూడా పేదలు, రైతుల చుట్టే తిరుగుతుంది. కులం, మతం ఆధారంగా విద్యాసంస్థలు ఉండటం సరికాదు. అన్ని కులాలు, అన్ని మతాలు ఒకేచోట చదవాలనేదే నా ఆశయం. ఎట్టి పరిస్థితుల్లో జాతి వివక్షను ప్రొత్సహించేలా విద్యా విధానం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేశారు. డాక్యుమెంట్‌లో యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. 10 కీలక వ్యూహాలతో మూడు భాషల్లో రూపొందించారు. సమతుల్య అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ విధానం తీసుకొచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాల రూపకల్పన చేశారు.






