- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది: CM రేవంత్
టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలన్న లక్ష్యంతో సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్‌తో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలన్న లక్ష్యంతో సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్‌తో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘రామాయణం’ సీరియల్‌ను నిర్మించిన సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెరకెక్కించనున్న “శ్రీమద్ భాగవతం” పార్ట్ -1 సినిమా ముహూర్త సన్నివేశాన్ని ముఖ్యమంత్రి క్లాప్ కొట్టి ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు ఆకాశ్ మోతీ సాగర్, అమృత్ సాగర్, సీఈవో అకాశ్ సాగర్ చోప్రాతో పాటు నటీనటులు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, “రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితంలో, సంస్కృతిలో ఒక భాగం. అలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తెరకెక్కించడం అందరికీ గొప్ప ప్రేరణను ఇస్తుంది. భారతీయ వసుదైక కుటుంబం గురించి ఒక భావన కల్పించడానికి శ్రీమద్ భాగవతం (పార్ట్ -1) సినిమాను తెరకెక్కిస్తున్న సాగర్ పిక్చర్స్ సంస్థకు అభినందనలు. 40 ఏళ్ల కిందట రామానంద సాగర్ గారు నిర్మించిన రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో వస్తుందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. ఆ సీరియల్ వల్ల దూరదర్శన్ ప్రజలకు చేరువైంది. కోవిడ్ సమయంలోనూ మరోసారి రామాయణం ప్రసారం చేసి ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఇప్పుడు మూడో తరం వారు శ్రీమద్ భాగవతాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నందుకు అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలి. రానున్న రోజుల్లో రామాయణం సీరియల్ ను మించి రికార్డు సృష్టిస్తుంది. దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలి. అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించడం సంతోషకరం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ప్రత్యేకమైన ఈ స్టూడియో ఇక్కడ ఉండటం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం..” అని ముఖ్యమంత్రి చెప్పారు. ట్వీట్






