- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకు ఏపీతో పోటీ లేదు.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్, స్ట్రాటజీ.. రెండు ప్రధాన అంశాలు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పారదర్శక పాలసీలు ఉండాలి. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుంది. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్ సంస్థల సహకారంతోపాటు విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. నెట్ జీరో సిటీ, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలి. కోర్ అర్బన్ రీజియన్‌ను సర్వీస్ సెక్టార్‌గా మారుస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తాం. మా పోటీ ఏపీ, కర్ణాటక లాంటి పక్క రాష్ట్రాలతో కాదు.. చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నాం. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం కేంద్రంతో అంగీకారం కుదిరింది. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.






