‘కేసు తీవ్రతను బట్టే యాక్షన్’.. కేటీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-11 13:18:19  IST  )

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కేసు తీవ్రతను బట్టే యాక్షన్’.. కేటీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిపై కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించిన సీఎం, తదుపరి చర్యలపై స్పష్టత ఇచ్చారు. ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలి అనేది తన చేతుల్లో లేదని, అది పూర్తిగా దర్యాప్తు సంస్థలు, కోర్టుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి మాత్రమే చర్యలు ఉంటాయని, విచక్షణారహితంగా ఎప్పుడూ విచారణలకు ఆదేశించబోనని స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, చట్టపరమైన నిబంధనల ప్రకారమే విచారణ జరుగుతుందని ఆయన వివరించారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించారనే ఆరోపణలపై ఇప్పటికే విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

గుప్తనిధుల కోసమే 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని కూల్చారా? : హరీష్ రావు సంచలన ఆరోపణలు

Next Story