- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అందుకే నా మనవడిని తీసుకెళ్లా’.. మెస్సీతో ఫుట్‌బాట్ మ్యాచ్‌పై CM రేవంత్ క్లారిటీ
‘అందుకే నా మనవడిని తీసుకెళ్లా’.. మెస్సీతో ఫుట్‌బాట్ మ్యాచ్‌పై CM రేవంత్ క్లారిటీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాట్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)తో మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. మనవడితో కలిసి మైదానంలో వచ్చిన విషయం తెలిసిందే. సరదాగా మనవడిని మెస్సీతో ఆడించారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. గతంలో కేసీఆర్ మనవడిపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారని.. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిందేంటని ప్రశ్నల వర్షం కురిపించాయి. తాజాగా ఈ టాపిక్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో సమావేశంలో వివరణ ఇచ్చారు.
‘మెస్సీ ఈవెంట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు. పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమం. మెస్సీ ఈవెంట్‌కు తాను కూడా గెస్ట్‌గా మాత్రమే వెళ్లాను. సింగరేణి యాజమాన్యం అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. ఫుట్‌బాట్ ఆడించడానికి మాత్రమే మనవడితో వెళ్లాను. మేం పబ్బులు, గబ్బుల చుట్టూ వారసులను తిప్పలేదు. కొందరిలో అధికారం పోయినా.. ఇంకా అహంకారం తగ్గలేదు. మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువైంది’ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అసూయ, అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం ఫలితాలు సాధించినట్లు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కూటమికి కేవలం 33 శాతమే దక్కాయని.. ఇకనైనా మారాలని రెండు పార్టీల నేతలకు హితవు పలికారు.






