- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. CM రేవంత్ కీలక నిర్ణయం!
మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలకు గతనెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections)నూ ఇదే ఊపులో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, రాష్ట్ర పీసీసీ పెద్దలు ఇదే ఊపుతో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించేందుకు జిల్లా పార్టీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని మంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఆ తర్వాత మిగతా జిల్లాల్లోనూ రేవంత్ రెడ్డి పర్యటన ఉండనున్నట్లు సమచారం.






