- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినూత్నంగా CM రేవంత్ బర్త్ డే సెలబ్రేషన్స్
సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్‌నేతలు తమ అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శిస్తూ విషెస్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్‌నేతలు తమ అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శిస్తూ విషెస్ తెలిపారు. శనివారం మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన ఎయిర్ బెలూన్‌ను అయన హిడెన్ కాస్టల్ సిద్దిపేటలో ఎగరవేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతన్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, ప్రతి తెలంగాణ బిడ్డకు కనిపించాలనే ఆలోచనతోనే ఎయిర్ బెలూన్ గ్రీటింగ్స్‌కి చేపట్టానని ఆయన తెలిపారు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ తెలంగాణను నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టేందుకు చేస్తున్న సీఎం చేస్తున్న కృషికి తామంతా అండగా ఉంటామని మహిపాల్ రెడ్డి తెలిపారు.
హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పంతో బర్త్‌డే విషెస్
కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి హైదరాబాద్హుస్సేన్ సాగర్ తీరాన సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సైకత శిల్పాన్ని రూపొందించి సీఎంకి విషెస్తెలియజేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ తన శాండ్ ఆర్ట్‌తో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించగా విజయారెడ్డిని, వరప్రసాద్‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ దగ్గర విజయారెడ్డి నిర్వహించిన సంబరాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.






