- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hakimpet: రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం రేవంత్
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) హైదరాబాద్‌కు వచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారం(Bollaram)లోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. తొలుత ఏపీలో ఇవాళ జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఏపీలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వచ్చారు.
రాష్ట్రపతిని ఆహ్వానించిన వారిలో ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు ఉన్నారు. ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు సికింద్రబాద్‌లోని బొల్లారంలో ద్రౌపది ముర్ము ఉండనున్నారు. ఈనెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.






