CM Revanth: హింసకు మేం వ్యతిరేకం.. సీఎం రేవంత్ ఆసక్తిర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

మావోయిస్టుల (Maoists)తో శాంతి చర్చలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి స్పందించారు.

CM Revanth: హింసకు మేం వ్యతిరేకం.. సీఎం రేవంత్ ఆసక్తిర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల (Maoists)తో శాంతి చర్చలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హింసకు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. లోకంలో ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే అంతిమ పరిష్కారమని పేర్కొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ అధిష్టానంతో చర్చించాక తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. కాగా, మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar)‌ను వెంటనే నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ (Justice Chandra Kumar) నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ ఏప్రిల్ 27న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

Next Story