దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!

by velandi.Saikiran |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, యూఎస్ పర్యటన ఖరారు. ఈనెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటించనున్నారని తెలుస్తోంది.

దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, యూఎస్ పర్యటన ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ కోసం మరోసారి విదేశాలకు వెళ్ళనున్నారట. ఈనెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలుస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

అనంతరం అక్క‌డి నుంచే నేరుగా అమెరికా పర్యటనకు ఆయన వెళ్తారని తెలుస్తోంది. ఈ మేరకు విదేశీ పర్యటన షెడ్యూల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ షెడ్యూల్ ఖరారు అయితే ఆయన ఫిబ్రవరి ఒకటో తేదీన తిరిగి హైదరాబాద్ కు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. కాగా గతంలో కూడా విదేశాలకు వెళ్లి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే తరహాలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పయనం అవుతున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకున్న అనంత‌రం మేడారం వెళ‌తారు సీఎం రేవంత్.

Next Story