- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి ఉత్తమ్, పార్టీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో ఢిల్లీకి CM రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శుక్రవారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శుక్రవారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనలో సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది.
పర్యటన ప్రాధాన్యత..
రాష్ట్రంలో పాలన పరంగా 28 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సీఎం ఏఐసీసీ అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో సీఎం ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాయంత్రం ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది.






