- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యాహ్నం బెంగళూరుకు CM రేవంత్.. అసలు విషయం ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరు (Bengaluru)లోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో (MS Ramaiah Hospital) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాట్ సర్జరీ చేశారు. అయితే, మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.






