ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు... పెద్దన్నగా హాజరు కానున్న సీఎం రేవంత్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు... పెద్దన్నగా హాజరు కానున్న సీఎం రేవంత్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తోంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే ఈ ఇళ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. అంతేకాదు ఈ గృహ ప్రవేశాలకు పెద్దన్న హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని సమాచారం. అందులో భాగంగా ఈనెల 21న భద్రాద్రి అశ్వారావుపేటలో జరిగే గృహప్రవేశ వేడుకలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Next Story