- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPS అధికారి పూరణ్ ఫ్యామిలీతో మాట్లాడిన CM రేవంత్
హర్యానా ఐపీఎస్ అధికారి వై.పూరణ్‌కుమార్ ఆత్మహత్య(IPS Puran Kumar Suicide) వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా ఐపీఎస్ అధికారి వై.పూరణ్‌కుమార్ ఆత్మహత్య(IPS Puran Kumar Suicide) వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛండీగఢ్ పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).. ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. దేశంలోని అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారికే సామాజిక న్యాయం దక్కడం లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని ఛండీగఢ్ చీఫ్ సెక్రటరీ రాజేష్ ప్రసాద్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. AICC నాయకుడు కొప్పుల రాజు, సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్‌లతో కలిసి పూరణ్ కుమార్ భార్య అమ్నీత్, తండ్రి విజయకుమార్, తల్లి సుశీల, కుటుంబ సభ్యులను పరామర్శించారు.






