మిగతా జిల్లాల కలెక్టర్లకు స్పూర్తి కావాలి: జనగామ జిల్లా కలెక్ట‌ర్‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

by Ramesh Naini |

తెలంగాణలోని జనగామ జిల్లా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశవ్యాప్తంగా 50 ఉత్తమ జిల్లాలను ఎంపిక చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం దీనికి మాత్రమే చోటు దక్కింది.

మిగతా జిల్లాల కలెక్టర్లకు స్పూర్తి కావాలి: జనగామ జిల్లా కలెక్ట‌ర్‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని జనగామ (Jangaon) జిల్లా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశవ్యాప్తంగా 50 ఉత్తమ జిల్లాలను ఎంపిక చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం దీనికి మాత్రమే చోటు దక్కింది. ఈ ఘనతకు ప్రధాన కారణం అక్కడి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ జిల్లా చోటు సంపాదించడం హర్షించదగిన విషయమని తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ విజయం నిదర్శనం.. అని తెలిపారు. ఈ విజయానికి కారణమైన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా (Rizwan Basha) ఆదర్శనీయుడు. ఆయనకు నా ప్రత్యేక అభినందనలు.. మిగతా జిల్లాల కలెక్టర్లకు జనగామ సాధించిన విజయం స్ఫూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాక్షించారు.

Next Story