వరంగల్ రోడ్డు ప్రమాదంపై CM రేవంత్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |

వరంగల్ శివారులోని మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద(Warangal Road Accident) ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వరంగల్ రోడ్డు ప్రమాదంపై CM రేవంత్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ శివారులోని మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద(Warangal Road Accident) ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్‌ను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, వరంగల్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ లారీ ఆటోలపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోల్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఓవర్ లోడుతో తెస్తున్న ఐరన్ పట్టాలు ఆటోలపై పడటం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. వరంగల్–మామునూరు శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సైతం మరణించినట్లు సమాచారం.

Next Story