CM Revanth: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

by Kema Shiva Kumar |

నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

CM Revanth: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక నిండు ప్రాణం బలవ్వడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ప్రభుత్వం చర్చలకు సిద్ధం..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని దు:ఖంలో ముంచింది. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం, మనోబలం కలగాలని కోరుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గమనిస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతుందని, ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. కార్మికులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story