CM Revanth Reddy : రేపు యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

by Muthe.Rajitha |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో పర్యటించనున్నారు.

CM Revanth Reddy : రేపు యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గంధమల్ల రిజర్వాయర్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి(Turkapalli)లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. పలు సంక్షేమ పథకాల లబ్దిదారులకు వాటి పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కిరణ్ చమల తదితరులు పాల్గొననున్నారు.

Next Story