- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఢిల్లీ టూర్ (Delhi Tour) ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే నిమిత్తం బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లారు. అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అనంతరం నిన్న ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో ఏఐసీసీ పెద్దలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై పార్టీ పెద్దలతో చర్చించారు. అనంతరం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కులగణన సర్వే, బీసీ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బీసీ బిల్లుల ఆమోదానికి రాహుల్ గాంధీ, ఎంపీలు కొట్లాడాలని వారి మద్దతు కోరారు. అనంతరం ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.






