ఉద్యోగులకు CM రేవంత్‌ స్వీట్ వార్నింగ్.. జీతంలో 10 శాతం కట్‌ చేస్తామని ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-27 14:09:06  IST  )

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికగా గ్రూప్‌-1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామకపత్రాలు అందజేశారు.

ఉద్యోగులకు CM రేవంత్‌ స్వీట్ వార్నింగ్..  జీతంలో 10 శాతం కట్‌ చేస్తామని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికగా గ్రూప్‌-1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉందని అన్నారు. ఆరు దశాబ్ధాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. కానీ కొందరు ఒక పార్టీ, ఒక కుటుంబం కోసమే అన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. కాలం కలిసొచ్చి రెండుసార్లు గెలిస్తే కారణజన్ములు అనుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మక ద్రోహం చేశారు.. ఓటమి పాలయ్యారని అన్నారు. పదేళ్లు గ్రూప్‌-1(Group-1) నిర్వహించలేదు, వాళ్లు ఉద్యమకారులా.? అని సీరియస్ అయ్యారు. తెలంగాణ స్ఫూర్తి వారిలో లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్‌ఎంపీ డాక్టర్లను కూడా టీజీపీఎస్‌సీలో సభ్యులుగా నియమించారని అన్నారు. కడుపు నిండా విషం పెట్టుకొని నిరుద్యోగులను దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అంతేగాకుండా.. రూ.2,3 కోట్లు తీసుకొని గ్రూప్‌-1 ఉద్యోగాలు అమ్ముకున్నానని నాపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. పదేళ్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే.. విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గ్రూపు-1 కోసం 3 లక్షల మంది పోటీ పడితే 562 మంది ఎంపిక అయ్యారని అన్నారు. ‘ఈ సందర్భంగా గ్రూపు-1 ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ జీతంలో 10 శాతం కట్‌ చేసి మీ పేరెంట్స్‌కు ఇస్తాం. త్వరలో చట్టం చేస్తాం’ అని సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Next Story