- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికులకు CM రేవంత్ ‘మేడే ట్రీట్’.. అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల అభ్యర్థనను మన్నిస్తూ, ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలను పరిష్కరిస్తూ వారికి తీపి కబురు అందించారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ మూడు రోజులకు సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న కార్మికులకు ఆర్థికంగా ఊరట కలగనుంది. సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన పోలీసు కేసులను కూడా పూర్తిగా ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ కేసుల వల్ల ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం. కార్మిక సంఘాల నాయకులు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి, అధికారులకు ఆదేశాలు..
ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వేతనాల చెల్లింపు, కేసుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు మరియు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






