CM Revanth Reddy : రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

by Muthe.Rajitha |

రైతులకు తెలంగాణ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్ తెలియ జేసింది.

CM Revanth Reddy : రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు తెలంగాణ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్ తెలియ జేసింది. రైతుభరోసా(Rythu Bharosa) పథకంపై ముఖ్య ప్రకటన జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియా సమావేశం నిర్వహించారు. రూ.16 వేల కోట్ల మిగిలుతో తెలంగాణను కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు అందిస్తే.. పదేళ్ళ తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారు. ఆ అప్పులకు ప్రతినెలా 6500 కోట్ల వడ్డీలు కడుతున్నాం. అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశాం. రైతులే మా ఎజెండా. అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతుబంధు(Rythubandhu)ను రూ.7625 కోట్లు విడుదల చేసింది. రైతు ఋణమాఫీ(Rythu Loan waiver) 25 రోజుల్లోనే దాదాపు రూ.17,869 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు చేశాం. శనివారం మహబూబ్ నగర్లో జరిగిన సభా వేదికగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లెమ్ వలన ఆగిపోయిన వారికి కూడా రుణమాఫీ చేశామని తెలియ జేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మేము మాత్రమే అని తెలియజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలుగా, అది కూడా కొద్ది మందికి మాత్రమే చేశారు. 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో రైతు తీసుకున్న రుణాలు అన్నీ మేము ఏకకాలంలో తీర్చినం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా(Rythu Bharosa) అందిస్తామని హామీ ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి.. సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను అని వెల్లడించారు.

Next Story