- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ మోడీ.. కాలేజ్ చంద్రబాబు దగ్గర చదువుకున్నా.. పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ప్రసంగం
హైదరాబాద్‌లోని శిల్పకలావేదికలో ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శిల్పకలావేదికలో ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Haryana Governor Dattatreya) జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని తెలిపారు. ఆయన నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసిందని కొనియాడారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యాణ గవర్నర్‌గా దత్తాత్రేయ ఎదిగారని అన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులు చూశారని తెలిపారు. ఏ రోజూ దత్తాత్రేయ ప్రజలతో సంబంధాలు కోల్పోలేదన్నారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. అలయ్ బలయ్‌తో రాజకీయలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించే వారని తెలిపారు.
పుస్తకావిష్కరణకు అన్ని పార్టీల నేతలు వచ్చారని, దత్తాత్రేయ బీజేపీ నేత అని.. పార్టీ కార్యక్రమం అనే భావన ఎవరికీ లేదని, ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడిగా చూస్తారని హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకం చదవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. జాతీయ స్థాయిలో వాజ్‌పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో బండారు దత్తాత్రేయకు ఉందన్నారు. హైదరాబాద్‌లో నేతలు పీజేఆర్, బండారు దత్తాత్రేయ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. ఎవరికీ ఏ కష్టమొచ్చినా.. ఏదైనా అవసరం ఉన్నా.. జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది వీరు ఇద్దరే అని కొనియాడారు. తాము తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. ఇటీవల ప్రధాని మోడీతో నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుకు చేశారు. మధ్యాహ్నం తినే సమయంలో ప్రధానితో ఈ విషయం మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. స్కూల్ మోడీ దగ్గర, కాలేజ్ ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర చదువుకున్నా.. ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






