- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో టీడీపీ భారీ విజయం.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనివీని ఎరుగని విజయం అందుకుంది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనివీని ఎరుగని విజయం అందుకుంది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విషెస్ తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూసమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం’’ అని ప్రముఖ సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు.






