‘కేసీఆర్‌కు వాళ్ల ఉసురు తాకింది.. అందుకే కూతురు దూరమైంది’: CM రేవంత్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.

‘కేసీఆర్‌కు వాళ్ల ఉసురు తాకింది.. అందుకే కూతురు దూరమైంది’: CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండువా కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు. ఇవాళ కూడా చాలా మందికి కండువాలు కప్పానని అన్నారు. కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదని చెప్పారు. బీఆర్ఎస్(BRS) ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి రూ.5 వేలు ఇప్పటికీ బీఆర్ఎస్‌కే వెళ్తున్నాయి.. అంతేగాకుండా బీఆర్ఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నిండు అసెంబ్లీలో హరీష్‌ రావు ఆన్‌రికార్డ్ చెప్పారని సీఎం రేవంత్ గుర్తుచేశారు.

‘‘ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తోంది. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే. వారి కుటుంబ పంచాయతీ నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ ఉద్యమం భావద్వేగం పేరిట అనేకమంది పిల్లలను పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఉసురు ఇప్పుడు తాకింది. అందుకే కుమార్తె దూరమైంది. గతంలో నా కూతురు పెళ్లికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటివరకు దానిపై మాట్లాడటం లేదు. ఫోన్ టాపింగ్ అంశం హైకోర్టులో ఉందని.. లేదంటే దాన్ని కూడా సీబీఐకి ఇచ్చే వాళ్ళం’’ అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story