- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు, చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏం లేదు
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్, హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్, హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను ఓడించి, ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయడమే ప్రజలు వేసిన పెద్ద శిక్ష అని.. కొత్తగా జైల్లో వేయాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. తనకు విద్వేశపూరిత రాజకీయాలు చేయడం రాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారిలో ఎవరికీ నైతిక విలువలు లేవని విమర్శించారు. బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) జరిగే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తోంది. తాత్కాలికంగా వీరు బీసీ రిజర్వేషన్లను ఆపామని సంబురపడొచ్చు.. కానీ ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్‌ను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.






