కేసీఆర్‌కు బలిసి సర్వేలో పాల్గొనలేదు.. మరోసారి రెచ్చిపోయిన CM రేవంత్

by Gantepaka Srikanth |

కులగణన(Caste Census)పై ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తాం.. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేశాం.. మైనార్టీల లెక్క ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారు..

కేసీఆర్‌కు బలిసి సర్వేలో పాల్గొనలేదు.. మరోసారి రెచ్చిపోయిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన(Caste Census)పై ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తాం.. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేశాం.. మైనార్టీల లెక్క ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారు.. బీసీ-ఈ గ్రూప్ కింద 4 శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టే మైనార్టీల లెక్క తీశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపారు.. కాకి లెక్కలతో సర్వే చేసి.. మా సర్వే తప్పంటున్నారని మండిపడ్డారు. కులగణనపై విపక్షాలది దుష్ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పాల్గొనని కేసీఆర్‌(KCR)కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో కష్టపడి పని చేసినవారికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయి.. చంద్రబాబు, కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’ అన్న ప్రజల ఆకాంక్షలను యూత్ కాంగ్రెస్ కష్టపడి సాధించింది.. పార్టీలో అగ్రనేతలంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక ధాన్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారు.. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత రుణమాఫీ మన ప్రభుత్వం చేసిందని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. మోడీపై యుద్ధం కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. నిధులు బిహార్, గుజరాత్ కేనా.. మెట్రో నిర్మాణం, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదు.. దీనికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story