ఆయనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

యువజన కాంగ్రెస్(Youth Congress Telangana) నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు.

ఆయనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: యువజన కాంగ్రెస్(Youth Congress Telangana) నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. శుక్రవారం జక్కిడి శివచరణ్ రెడ్డి(Jakkidi Shiva Charan Reddy) తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు పాలనే సరిపోతుంది.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నేతలదే అని అన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరూ డబ్బులు ఖర్చు చేసి గెలవలేదని.. అందరూ ప్రజాభిమానంతోనే గెలిచారని తెలిపారు. డబ్బులే గెలిపిస్తాయనుకుంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న ఆయన బయటకొచ్చి కొడితే గట్టిగా కొడతానని అంటున్నారు.. కేసీఆర్‌కు అంతగా కొట్టాలనిపిస్తే ముందు కేటీఆర్‌ను, హరీష్ రావు, కవితనే కొట్టాలి. కేసీఆర్‌(KCR)ను కేటీఆర్(KTR) ఓడిస్తే.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కవిత ఓడించింది. మీ కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలు చూసే ప్రజలు బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారు’ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక యూత్ కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగాల్సిన టైమ్ వచ్చింది. కేసీఆర్ క్షేత్రంలో ఉన్నప్పుడే నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రధాని మోడీ(PM Modi), మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కౌగిలి.. ధృతరాష్ట్ర కౌగిలిగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత మంచి చేస్తున్నా.. ఒకవర్గం అదే పనిగా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే తమకు జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. ఒక్కసారి కాదు.. మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్(Youth Congress) నేతలతో కలిసి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతు భరోసా ఇచ్చాం.. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. విద్య, వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. అయినా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఎవరేం చేసినా.. తామేంటో ప్రజలకు తెలుసని.. ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని.. రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story