- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. జంపన్న వాగుపై కీలక ప్రకటన
మేడారం వేదికగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం వేదికగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు అని తెలిపారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని అన్నారు. గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది.. అని హర్షం వ్యక్తం చేశారు. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క-సారలమ్మలు అని, దక్షిణాది కుంభమేళా మేడారం జాతర అని కొనియాడారు.
మేడారం నుంచే ప్రజాకంఠ పాలనకు నాంది
‘ఆనాడు ఫిబ్రవరి 6, 2023 న ప్రజాకంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించాను.. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ఇది నాకు అరుదైన అవకాశం అని అన్నారు. జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటానని సంతోషం వ్యక్తం చేశారు.
మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తాం
మేడారం అభివృద్ధి చేసి ఫిబ్రవరి 6, 2023 న మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నామని అన్నారు. మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తామని కీలక ప్రకటన చేశారు. రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీరు తరలిస్తామని సంచలన హామీ ఇచ్చారు. రేపు ఉదయం సమ్మక్క- సారక్క ఆలయాయాన్ని ప్రారంభించుకుని భక్తులకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.






