- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC Strike: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకో వెళ్లవద్దని సమ్మె (RTC strike) ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో అవతలి వారు రాజకీయ ప్రేరేపితంతో కపుడు మంటతో, అసూయతో విషపు మాటలు నమ్మి సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించాలని మేము చేయగలిదింది ఏది ఉన్నా చేస్తామని అన్నారు. ఈ సంస్థ మీది అని గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ పార్టీ 50 మంది కార్మికులను పొట్టనపెట్టుకుంది కానీ మీతో మాట్లాడలేదన్నారు. మేడే (May Day) సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒక్కటేనని రాష్ట్రానికి వచ్చే ఆదాయ లెక్కలన్నీ మీ ముందే ఉంచుతాను. ఏ పథకం ఆపాలో ఏ పథకం ఆపకూడదో మీరే చెప్పండన్నారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం బాగోలేదని కార్మిక సోదరులందరూ సహకరకించాలన్నారు. ఒక సంవత్సరం అయితే కుదురుకుంటామన్నారు.
కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ విధానం:
తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములయ్యారని, ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికల పాత్ర మరువలేనిదన్నారు. కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ విధానం అని సీఎం అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక సింగరేణి, ఆర్టీసీలో కారుణ్యనియామకాలను సులభతరం చేశామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కార్మికులందరూ సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అంఘటిత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. చనిపోయిన కార్మికుల పట్ల కనీసం మానవత్వంతో వ్యవహరించలేదని ద్వజమెత్తారు. సింగరేణి ఔట్ సోర్స్ సిబ్బందికి బోనస్ ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదేనని సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా కల్పించామన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా గిగ్ వర్కర్క్స్ విధానం తీసుకురాబోతున్నామన్నారు. గల్ఫ్ కార్మికులు అక్కడ చనిపోతే వారి శవాలను కూడా గత ప్రభుత్వం తేలేని పరిస్థితి ఉండేదని కానీ మేమొచ్చాక వారి శవాలను తీసుకురావడమే కాకుండా అలాంటి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. మేము అధికారంలోకి రాకముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. సర్పంచులకు ఇవాళ బకాయిలు ఉన్నాయంటే దానికి కేసీఆరే కారణం అన్నారు.
కపట నాటక సూత్రధారి కేసీఆర్..
పదేళ్లు ఏమీ చేయని కమట నాటక సూద్రధారి మళ్లీ బయటకు వచ్చాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. వరంగల్ సభలో కేసీఆర్ (KCR) ఒకటే శాపనార్ధాలు పెడుతున్నారని పిల్లి శఆపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదన్నారు. నన్ను నమ్మండి 20 ఏళ్లు మీకు అండగా ఉంటానన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని తెలంగాణలోని పేదలు మరింత పేదలుగా మారితే కేసీఆర్ కుటుంబం ఎలా వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. కేసీఆర్ రూ. 8.15 లక్షల కోట్లు అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని ఆయన చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలోనే మరొకటి లేదని అన్నారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా ఇది జరగలేదని ఇది నా చాలెంజ్ అని మాతో పోటీ పడాలన్నారు. ఇంత చేసినా ఇది సరిపోదని రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి మరికొంత సమయం కావాలన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణ కులగణన చేసినట్లుగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిందంటే దీనికి కారణం కార్మికులందరూ తెలంగాణలో తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అన్నారు.






