వారి వల్లే నేను తెలంగాణలో హీరో అయ్యా్: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

వారి వల్లే నేను తెలంగాణలో హీరో అయ్యా్: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని 'విలన్ల' (బీఆర్ఎస్ నేతలు) వల్లే ప్రజలు తనను 'హీరో'ను చేశారని ఆయన వ్యాఖ్యానించారు. రామాయణంలో రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడికి అంత పేరు వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో గత పాలకుల తీరు వల్లే కాంగ్రెస్‌కు, తనకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ.. తాను మరో ఎనిమిదేళ్ల పాటు తెలంగాణలోనే ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో దేశ రాజకీయాలకు తాను అవసరమని పార్టీ భావిస్తే, ఆ నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేస్తున్నానని చెప్పారు. దేశంలోనే తెలంగాణ డీఎన్ఏ భిన్నమైందని, ఇదొక వైబ్రెంట్ ప్లేస్ అని ఆయన కొనియాడారు. తెలంగాణకు, గాంధీ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను ఒక నాయకుడిలా కాకుండా, కార్యకర్తగానే భావిస్తానని, వారి కష్టనష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు.

బీజేపీపై విమర్శల బాణం..

ప్రధాని మోడీ అనుసరిస్తున్న 'త్రీడీ (3D) పాలసీ'కి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశం మొత్తం ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన ఆరోపించారు. వెంకయ్య నాయుడుని రాష్ట్రపతిని చేయకుండా, కేవలం ఉపరాష్ట్రపతి పదవితో ఎందుకు సరిపెట్టారు?" అని ప్రశ్నించారు. కేంద్రంలో హోంశాఖ వంటి కీలక బాధ్యతలను దక్షిణాది నేతలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాదికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎదిగారని, రాజకీయ వివక్ష కేవలం బీజేపీలోనే కనిపిస్తోందని విమర్శించారు.

Next Story