ఆ రెండు సంతకాలు చేసి.. తెలంగాణకు KCR మరణశాసనం రాశారు: CM రేవంత్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

ఆ రెండు సంతకాలు చేసి.. తెలంగాణకు KCR మరణశాసనం రాశారు: CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. మంగళవారం ప్రజా భవన్‌లో గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నీటి హక్కుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్(KCR), హరీష్ రావుల వద్దే ఇరిగేషన్ శాఖలు ఉన్నాయని చెప్పారు. నీళ్లు తెస్తారని ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయాలు మనకు గుదిబండగా మారాయని అన్నారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. తాము నీటి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నామని వెల్లడించారు. కృష్ణాలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే కొట్లాడైనా నీళ్లు తెచ్చుకునే వాళ్లమని అన్నారు. నీటి వివాదాల పరిష్కారంపై కేంద్రం కూడా దృష్టి పెట్టడం లేదని అసహనం వ్యక్త చేశారు.

కృష్ణాలో 68 శాతం పరివాహకం తెలంగాణలో ఉన్నా.. తెలంగాణకు 299 టీఎంసీలే సరిపోతాయని గతంలో కేసీఆర్ మరణశాసనం రాశారని మండిపడ్డారు. లెక్క ప్రకారం తెలంగాణ 68 శాతం నీటిని వాడుకొని.. మిగిలిన నీటినే ఏపీకి ఇవ్వాలి.. కానీ 299 టీఎంసీలే చాలని కేసీఆర్ రెండు సార్లు సంతకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. 299 టీఎంసీలు ఉన్నా.. ఏనాడూ 220 టీఎంసీలకు మించి వాడలేదని విమర్శించారు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌ ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Next Story