- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డిది అబద్దాల పాలన : ఎమ్మెల్సీ కవిత
CM Revanth Reddy's rule of lies: MLC Kavitha

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నిజామాబాద్ లో మరో బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardan) తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్(Niazamabad) జిల్లాలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశామని.. దానిని వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఒకప్పుడు నీటితో నిండి కుండలా ఉండి, సిరులు పండించిన నిజామాబాద్ రైతులు.. మళ్ళీ యూరియా కోసం లైన్లు కడుతూ, వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు ఉంటుందో లేదో తెలియని స్థితిలో గోస పడుతున్నారని తెలిపారు. ఒక్క చెరువును ఏ నాయకుడు గాని, అధికారి గాని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఫైర్ అయ్యారు. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాలం వెళ్లదీస్తున్నారని, అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy) బొమ్మ కనబడుతుంది కవిత ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు గ్రామసభలు అంటూ హడావిడి చేశారని.. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారని అన్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్ళకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తున్నారు. దీనిని ప్రజలు గమనించాలని అన్నారు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో లబ్దిదారుల అకౌంట్లోకి డైరెక్ట్ గా వేశామని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని అబద్దాలు చెప్పుకుంటున్నారని.. వాస్తవానికి అర్హులలో 10% కూడా ఇవ్వడం లేదని కవిత మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఇచ్చిన వృద్ధాప్య పెన్షన్, బీడీకార్మికుల పెన్షన్స్ తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం ఇస్తున్నది ఏమీ లేదని అన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామని, స్కూటీలు ఇస్తామని అలవికాని హామీలు ఇచ్చి.. ఇపుడు వాటిని మర్చిపోయారని అన్నారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట(Kumabhamela Stampede)పై సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపిన కవిత.. కుంభమేళా శివరాత్రి వరకు జరుగుతుందని.. అందులో పాల్గొనే తెలంగాణ ప్రజలకు హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ మొదలు పెట్టిన పథకాలను కొనసాగిస్తున్నారు తప్ప కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. నిజామాబాద్ లో ఈ ఏడాది పసుపు అధికంగా పండిందని.. పసుపు బోర్డ్(Turmeric Board) ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదని, పసుపుకు మద్ధతు ధర పెంచేందుకు బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు.






