సెక్రటేరియట్‍లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. మరికాసేపట్లో మీడియా సమావేశం!

by Prasad Jukanti |

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‍‍పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సెక్రటేరియట్‍లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. మరికాసేపట్లో మీడియా సమావేశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising 2047 policy document) పాలసీ డాక్యుమెంట్‍ను ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 8,9 వ తేదీలలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఈవెంట్‍లోనే రాష్ట్ర పాలసీ డాక్యుమెంట్‍ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ - 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‍పై (Telangana Rising Global Summit 2047) ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షా (Review meeting) నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్‍లో జరుగుతున్న సమీక్ష మావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్, పాలసీ డాక్యుమెంట్‌ కనిపించాలని ఇప్పటికే సీఎం అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ అంశంపై ఇవాళ సమీక్షలో కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ సమీక్ష అనంతరం మంత్రులతో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story