- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy ; కేంద్ర కులగణన నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో జన గణన(Census)తోపాటు కులగణన(Cast Census) కూడా నిర్వహించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో జన గణన(Census)తోపాటు కులగణన(Cast Census) కూడా నిర్వహించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కేబినెట్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో రాహుల్ గాంధీ(Rahul Gandhi) విజన్ సాకారం కాబోతుందని, విపక్షంలో ఉండి కూడా కేంద్ర ప్రభుతవబా విధానాన్ని ఆయన ప్రభావితం చేశారని అన్నారు. దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.






