NLG: నల్లగొండ నుంచి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్.. ఏంటంటే?

by Gantepaka Srikanth |

తెలంగాణ(Telangana) మలిదశ ఉద్యమంలో నల్లగొండ జిల్లా పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

NLG: నల్లగొండ నుంచి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్.. ఏంటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) మలిదశ ఉద్యమంలో నల్లగొండ జిల్లా పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శనివారం నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారిది(Srikanth chary) నల్లగొండ జిల్లానే అని అన్నారు. నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుందని తెలిపారు. నల్లగొండకు కృష్ణా జలాలు వస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు. కానీ పాలించిన పదేళ్లు నల్లగొండ జిల్లాను బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యం చేశారని అన్నారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ కేసీఆర్(KCR) హయాంలో నిలిచిపోయాయని తెలిపారు.

ఉమ్మడి పాలనలో కంటే.. కేసీఆర్ పాలనలోనే నల్లగొండకు అధిక నష్టం జరిగిందని గుర్తుచేశారు. తాను హామీ ఇస్తున్నా.. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా అని భరోసా ఇచ్చారు. గతంలో వరి పంట వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అన్నారు. కానీ తాము వరి పంటకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. తాము ఓడిపోయినా కూడా ఏనాడూ ఇంట్లో కూర్చోలేదని.. సంవత్సర కాలంగా కేసీఆర్ ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది కాదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఆయన ఫామ్‌హౌస్‌లో కూర్చొని ఒక గాలి బ్యాచ్‌ను బయటకు వదిలారు.. వాళ్లు పిచ్చి పిచ్చిగా అరుస్తూ రోడ్లమీద తిరుగుతున్నారని విమర్శించారు. తాము చేసే అభివృద్ధిని ఆ గాలి బ్యాచ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

Next Story