- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టర్లకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. ఫండ్స్ రిలీజ్‌పై రియాక్షన్ ఇదే!
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టు పనులను రివ్యూ చేసిన తరవాతే బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టు పనులను రివ్యూ చేసిన తరవాతే బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అప్పటివరకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అంచనాలు పెంచి, కాంట్రాక్టు పనులు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరవాత వాటిపై రివ్యూ చేసి, చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అందులో భాగంగా కాంట్రాక్టు పనులను రివ్యూ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఇరిగేషన్ పనులపైనే ఫోకస్
కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ పనులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పనుల్లో నాణ్యత లేదని వాదనలు తెరమీదికి వచ్చాయి. దీనితో ఇరిగేషన్ శాఖలోని పెండింగ్ బిల్లులకు డబ్బులు ఇవ్వొద్దని, పనులను రివ్యూ చేసిన తరువాత చెల్లించాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. త్వరలో ప్యాకేజీల వారీగా పనులు చేసిన సంస్థలను పిలిచి రివ్యూ నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. అలాగే వివిధ శాఖలు చేసే అత్యవసరమైన ఖర్చులకు క్లియరెన్స్ ఇచ్చారు. ఆసరా పెన్షన్ల నిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సూచించినట్టు తెలిసింది.






