CM Revanth Reddy : మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

by Muthe.Rajitha |

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో ఢిల్లీలో మీడియా సమావేశం(Press Meet) నిర్వహించనున్నారు.

CM Revanth Reddy : మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో ఢిల్లీలో మీడియా సమావేశం(Press Meet) నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy)తో కలిసి ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)కు అనుమతులు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. అదే విధంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను విజ్ఞప్తి చేశారు.

మరోవైపు బ్రిటన్ కు చెందిన టోనీ బ్లెయిర్ సంస్థతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా ఈ రెండు రోజుల పర్యటన అంశాలు, అదే విధంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతోపాటు, బనకచర్లపై నిన్న ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్టు సమాచారం.

Next Story