పారుతున్న నీళ్లను ఎత్తిపోస్తే బ్యారేజీలు ఎందుకు?.. కాళేశ్వరంపై BRSకు సీఎం కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-11 13:19:45  IST  )

కాళేశ్వరం బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని, బీఆర్ఎస్, ఈటల రాజేందర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.

పారుతున్న నీళ్లను ఎత్తిపోస్తే బ్యారేజీలు ఎందుకు?.. కాళేశ్వరంపై BRSకు సీఎం కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ చెబుతున్నట్లు కళ్లముందు నీళ్లు పారుతున్నంత మాత్రాన ఎత్తిపోసే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టే అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యారేజీలు కడ్డటం అంటేనే పారుతున్న నీళ్లను నిలిపి వాటిని ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు. కన్నెపల్లి దగ్గర ఎత్తిపోతలకు అవకాశమే లేదని 93.5 మీటర్ల ఎత్తులో నీరు నిలిపితేనే ఎత్తిపోతల సాధ్యం అవుతుందన్నారు. ఈటల రాజైందర్ అంటే మాకు గౌరవమే కానీ కాళేశ్వరం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో రాజేందర్ తన గౌరవం కోల్పోయారన్నారు. హరీశ్ రావు సూచనలతో ఈటల రాజేందర్ మాట్లాడారని కాళేశ్వరంపై రాజేందర్ అవాస్తవాలు చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతల వాదననే బీజేపీ ఎంపీ ఈటల వినిపించారన్నారు.

కిలాడీ కమిటీలో రాజేందర్:

మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు ఉన్నట్లు గత ప్రభుత్వంలో ఈఈ రమణారెడ్డి లేఖ రాశాని రేవంత్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు సరిచేయకుంటే ఇబ్బందని లేఖలో పేర్కొన్నారన్నారు. నాడు రాసిన లేఖ పట్ల నిర్లక్షఅయం వహించడం వల్లే మేడిగడ్డ కుప్పకూలిందన్నారు. మేడిగడ్డలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని ప్లానింగ్, డిజైన్, నిర్మాణఁలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. 2022 జులైలో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోతే సరిచేయలేదన్నారు. ఎన్డీఎస్ఏ క్షేత్రస్థాయిలో పనిచేసేలా 2021 లో కేంద్రం చట్టం చేసింది. ఎన్డీఎస్ఏ మేడిగడ్డను సందర్శించి.. అందులో నీటి నిల్వ సాధ్యం కాదని చెప్పిందన్నారు. సీడబ్ల్యూసీ ప్రకారమే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. 80 వేల పుస్తకాలు చదివిన మేధావుల మాటలుగానీ.. ఖిలాడీ కమిటీల సూచనలు గానీ పట్టించుకోవద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ఎత్తిపోతల అంటే ఏంటో అమెరికాలో చదివిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే కమిటీ వేసి బ్యారేజీల పునరుద్ధరణకు యత్నిస్తామ్నారు. మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ప్రజల ముందు 2 కమిటీలు ఉన్నాయని ఒకటి కిలాజీ కమిటీ రెండోది ఎన్డీఎస్ఏ వేసిన కమిటీ ఉందన్నారు. కిలాడీ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఈటల సభ్యులుగా ఉన్నారని మండిపడ్డారు.

Next Story