- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క పర్యటనలో అనేక శంకుస్థాపనలు.. హాట్ టాపిక్‌గా CM నారాయణపేట టూర్
నారాయణపేట(Narayanapet) జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట(Narayanapet) జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Integrated Residential Schools) కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు శంకుస్థాపన, రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్ రోడ్, మద్దూర్ లింగాల్ చెడ్ రోడ్‌లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.193 కోట్లతో గుల్బర్గా కొడంగల్, రావులపల్లి మద్దూరు, కోస్గి దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సీఆర్ఆర్ రోడ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అంతకుముందు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల అకడమిక్ బ్లాకులు, రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలు, రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్‌ను, రూ.7 కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు.






