ఆ బాధ్యత మీదే.. కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

by Ramesh Naini |

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేడర్‌కు ఇవాళ సందేశం పంపారు.

TPCC President Revanth Reddy Alleged CM KCR of Destroying The Education System In The State
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేడర్‌కు ఇవాళ సందేశం పంపారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు విజ్ఞప్తి తెలిపారు. ఖమ్మం - నల్గొండ- వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6న ముగుస్తుందని, ఆ లోగా ఆ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Next Story