Nagoba Jatara: ‘నాగోబా జాతర’ సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

by Ramesh Naini |   (  Updated:2025-01-28 06:30:31  IST  )

‘నాగోబా జాతర’ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Nagoba Jatara: ‘నాగోబా జాతర’ సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. వనమే ఆలంబనగా అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలు అందరు జరుపుకునే వేడుక “నాగోబా జాతర” అని, (Tribes) గిరిజన సోదర, సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం (Telangana) తెలంగాణ సాంస్కృతిక వైభవమని పేర్కొన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుకలో ఆధ్యాత్మక వెలుగులు నింపే ఆదిశేషువు కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక సందేశం విడుదల చేశారు.

కాగా, నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర ఇది. గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర, ఆదివాసీ, గిరిజనులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇవాళ రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరగనుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 మంది పోలీసులు,100 సీసీ కెమెరాల నడుమ జాతరకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.

Next Story