- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: అలర్ట్‌గా ఉండండి.. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడింది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తన ఛాంబర్‌లో మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు మంత్రులతో సీఎం భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నీటివాటల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్‌గా ఉండాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలన్నారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం అని తెలిపారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలన్నారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు.
READ MORE ....
Next Story






