- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాసనమండలి భవన పునరుద్ధరణ పనులు పరిశీలించిన సీఎం రేవంత్
శాసన మండలి భవన పునరుద్ధరణ, మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శాసన మండలి భవన పునరుద్ధరణ, మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి మండలి సమావేశ మందిరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన సీఎం, పనుల నాణ్యత, వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, సోమవారం మూడో శాసనసభ ఏడవ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, విప్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి, శాసనసభల కార్యదర్శులు ఘనంగా స్వాగతం పలికారు. సభ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి స్థానానికి వెళ్లి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా పలకరించారు.
సభ జనవరి 2కి వాయిదా..
సభ తొలి రోజున దివంగత సభ్యులు సూర్యాపేట మాజీ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలియజేసింది. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జీరో అవర్‌ను నిర్వహించారు. కార్యక్రమాలు పూర్తికావడంతో సభను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు.
READ MORE ....
CM Revanth: అలర్ట్‌గా ఉండండి.. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ






