ముగిసిన భేటీ.. ఆమెతో కలిసి భోజనం చేసిన CM రేవంత్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్​భేటీ అయ్యారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్​రెడ్డి ఆమె భేటీ అయ్యారు.

ముగిసిన భేటీ.. ఆమెతో కలిసి భోజనం చేసిన CM రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్​భేటీ అయ్యారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్​రెడ్డి ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి ఇరువురి మధ్య పార్టీ, ప్రభుత్వ అంశాలు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు గురించి ఇరువురు చర్చించినట్లుగా సమాచారం. పార్టీ నాయకుల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలను సీఎం రేవంత్​రెడ్డికి ఆమె తెలిపినట్లుగా సమాచారం. కులగణన దేశ వ్యాప్తంగా తెలంగాణ ఆదర్శం కావడంతో దాని కొనసాగింపుగా ఏం చేయాలనే దానిపై కూడా చర్చించినట్లుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరుపై డిస్కస్​చేశారని తెలిసింది. దీనితో పాటుగా జూన్​2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను సీఎం వివరించినట్లుగా సమాచారం. ఆ రోజు ప్రారంభించే రాజీవ్​యువ వికాసం తదితర వాటి గురించి తెలిపినట్లుగా సమాచారం. పెండింగ్‌లో ఉన్న పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గం, నామినెటెడ్ పోస్టులు, డీసీసీ అధ్యక్షుల నియామకం తదితర వాటి నియామకానికి సంబంధించి కార్యచరణను చర్చించినట్లుగా తెలిసింది. అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మీనాక్షి నటరాజన్, అందుబాటులో మంత్రులతో కలిసి భోజనం చేసినట్లుగా సమాచారం.

Next Story